ఛాతీనొప్పిని అశ్రద్ధ చేయడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గుండెపోటు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చందానగర్‌లోని పీఆర్‌కే ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాథ్ ల్యాబ్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి గుండె పరీక్షలు చేయించుకున్నారు.
గుండె సమస్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: తలసాని
గుండెపోటు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. చందానగర్‌లోని పీఆర్‌కే ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాథ్ ల్యాబ్‌ను ప్రారంభించి, పరీక్షలు చేయించుకున్నారు.
గుండె సమస్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: తలసాని
తక్కువ ఖర్చుతో గుండెకు సంబంధించిన పరీక్షను పీఆర్‌కే ఆసుపత్రిలోని క్యాథ్ ల్యాబ్‌లో చేస్తున్నారని ప్రతి ఒక్కరూ చేయించుకోవాలని తెలిపారు. గుండె పోటు వచ్చిన రోగులకు బ్లాక్స్ గుర్తించి, స్టంట్స్ వేయడం సులభతరమవుతుందని మంత్రి పేర్కొన్నారు. గుండెకు సంబంధించిన తక్కువ ఖర్చుతో తమ ఆసుపత్రిలో చికిత్స అందిస్తామని హృద్రోగ నిపుణులు డాక్టర్ శివప్రసాద్ తెలిపారు.
ఇదీ చూడండి:మరో 45 లక్షల డోసుల కొవాగ్జిన్ కొనుగోలు!