తెలంగాణ

telangana

ETV Bharat / city

కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా సర్కార్​ దవాఖానాలు: తలసాని - సీఎంఆర్​ఎఫ్​ చెక్కుల పంపిణీ

ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్న పేదలకు... వెస్ట్ మారేడ్​పల్లిలోని తన నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సీఎంఆర్​ఎఫ్​ చెక్కులు అందజేశారు. అన్ని వసతులతో అభివృద్ధి చేసిన ప్రభుత్వ ఆసుపత్రులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

minister thalasani srinivas yadav distribute cmrf cheques in west maredpally
కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా సర్కార్​ దవాఖానాలు: తలసాని

By

Published : Aug 30, 2020, 3:21 PM IST

ఆర్థిక ఇబ్బందులతో సరైన వైద్య చికిత్స చేయించుకోలేని అనేక మంది పేదలకు... ముఖ్యమంత్రి సహాయ నిధి వరంగా మారిందని పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం వెస్ట్ మారేడ్​పల్లిలోని తన నివాసంలో... 12 మంది లబ్ధిదారులకు రూ.5 లక్షల విలువైన చెక్కులు అందించారు.

కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ దవాఖానాలను అభిృద్ధి చేసినట్టు మంత్రి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అమీర్​పేట, బన్సీలాల్ పేట కార్పొరేటర్లు నామన శేషుకుమారి, హేమలత, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'పరిసరాల పరిశుభ్రతలో అందరూ భాగస్వాములు కావాలి'

ABOUT THE AUTHOR

...view details