వలస కూలీలు ఆకలితో అలమటించొద్దనే తెలంగాణ ప్రభుత్వం నిత్యావసర సరకులు అందిస్తున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా పనులు దొరకక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉపాధి కోసం వచ్చిన కూలీలకు సొంత నిధులతో బన్సీలాల్పేట్లో 640 మందికి నిత్యావసర వస్తువులు అందజేశారు. ఇటువంటి సంక్షోభంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న మీడియాకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
ఎవరూ ఆకలితో అలమటించొద్దు: తలసాని - వలస కూలీలకు తలసాని సరకుల పంపిణీ
సికింద్రాబాద్ బన్సీలాల్పేటలో వలస కూలీలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఎవరూ ఆకలితో అలమటించొద్దనే ప్రభుత్వం బియ్యం, నగదు అందిస్తున్నట్టు మంత్రి తెలిపారు.

ఎవరూ ఆకలితో అలమటించొద్దు: తలసాని
ఎవరూ ఆకలితో అలమటించొద్దు: తలసాని
జంట నగరాల్లో దాదాపు 85 వేల మంది పొరుగు రాష్ట్రాల ప్రజలు హైదరాబాద్లో ఉన్నారని మంత్రి తెలిపారు. పని చేస్తే కానీ పూట గడవని కుటుంబాలని ఆదుకోవాలనే విడతల వారీగా నిత్యావసర సరకులు అందిస్తున్నట్టు వెల్లడించారు. దిల్లీలో ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లింలకు కరోనా వైరస్ సోకడం వల్ల వారితో సన్నితంగా ఉన్నవారిని గుర్తిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉంటూ సామాజిక దూరం పాటించాలని కోరారు.
ఇదీ చూడండి:మందు బాబులకు లిక్కర్ పాసులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం