ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే ఎంతటివారైనా విడిచిపెట్టేది లేదని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. పార్టీ పేరు చెప్పి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Talasani : 'సర్కార్ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు' - telangana animal husbandry minister talasani
సర్కార్ భూములపై కన్నేస్తే కఠిన చర్యలుంటాయని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలు తొలగించాలని అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని బాపూనగర్‌లో పర్యటించిన తలసాని.. ప్రభుత్వ భూములపై జీహెచ్ఎంసీ అధికారులు చేపట్టిన సర్వేను పర్యవేక్షించారు. బాపూనగర్‌లో సుమారు 400 గజాల స్థలాన్ని అధికార పార్టీ నేతలు ఆక్రమించారన్న ఫిర్యాదుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ భూములు గిరిజనులకు సంబంధించినవని.. వాటి ఆక్రమణకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. బాపూనగర్‌లో కమిటీ హాల్ నిర్మాణానికి భూసేకరణ చేయాలని అధికారులను ఆదేశించారు. సర్కార్ భూముల్లో అక్రమ కట్టడాలను తొలగించాలని చెప్పారు.
- ఇదీ చదవండి :Viral: బైక్‌పై వచ్చి తుపాకీతో హల్చల్