తెలంగాణ

telangana

ETV Bharat / city

చారిత్రక సంపద పరిరక్షణకు అధిక ప్రాధాన్యం: మంత్రి తలసాని - తెలంగాణ తాజా వార్తలు

హైదరాబాద్​ బన్సీలాల్​పేట్​లోని నిజాం కాలంనాటి మెట్ల బావి పునరుద్ధరణ పనులను మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ పరిశీలించారు. స్థానికులు, స్వచ్ఛంద సంస్థ వినతి మేరకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

minister talasani srinivas yadav
minister talasani srinivas yadav

By

Published : Aug 22, 2021, 8:43 PM IST

చారిత్రక సంపద, పురాతన కట్టడాల పరిరక్షణ, పునరుద్ధరణకు కేసీఆర్​ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని.. రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ తెలిపారు. సనత్​నగర్​ నియోజకవర్గంలోని బన్సీలాల్​పేటలోని నిజాం కాలంనాటి పురాతన మెట్లభావి పునరుద్ధరణ పనులను.. అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు.

40 ఏళ్ల కిందట ఇక్కడి ప్రజలు ఈ భావిని అనేక రకాలుగా వినియోగించేవారని తలసాని తెలిపారు. కాలక్రమేణా చెత్తాచెదారం వేయడం వల్ల.. ప్రస్తుతం ఈ భావి నిరుపయోగంగా మారిందని తెలిపారు. ఒక స్వచ్ఛంద సంస్థ, స్థానికుల వినతి మేరకు.. బాావి పునరుద్ధరణ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి తెలిపారు.

పనులు 15 శాతం కూడా పూర్తికాక ముందే స్థానికులు ఫలితాలను చూస్తున్నారని.. కేవలం 30 అడుగులకే నీళ్లు పడుతున్నాయన్నారు. పూర్తిగా పునరుద్ధరణ పనులు పూర్తయితే.. ఈ బావిలో ఎప్పుడూ మంచినీరు ఉండేవిధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని పేర్కొన్నారు.

ఇదీచూడండి:Rakshabandan: అన్నా చెల్లెలి అనుబంధం.. రక్షాబంధన్‌

ABOUT THE AUTHOR

...view details