'చేపపిల్లల పంపిణీలో మత్స్యకారులను భాగస్వామ్యం చేయాల్సిందే' ఈనెల 30వ తేదీ నాటికి చేపపిల్లల విడుదల కార్యక్రమం పూర్తి చేయాలని పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఉచిత చేపపిల్లల పంపిణీపై జిల్లా మత్స్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
నాణ్యతలో రాజీపడొద్దు...
ఈ ఏడాది 21,756 చెరువుల్లో 80.57 కోట్ల చేపపిల్లల్ని విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు 19.38 చేప పిల్లల్ని చెరువులు, కుంటల్లో విడిచిపెట్టినట్లు పేర్కొన్నారు. చేప పిల్లల నాణ్యత, పరిమాణం విషయంలో అధికారులు, మత్స్యకార పారిశ్రామిక సహకార సంఘాలు ఏ మాత్రం రాజీపడొద్దని స్పష్టం చేశారు. చేప పిల్లల పంపిణీలో ప్రజాప్రతినిధులు, మత్స్యకారులను పూర్తిగా భాగస్వామ్యం చేయాలని మంత్రి తలసాని ఆదేశించారు. దృశ్యమాద్యమ సమీక్షలో పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, మత్స్యశాఖ కమిషనర్ డాక్టర్ సువర్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ముదిరాజ్‌లను ఆర్థికంగా బలోపేతం చేసేందుకే చేపపిల్లల పంపిణీ