తెలంగాణ

telangana

ETV Bharat / city

talasani on ghmc works: 'రానున్న వానాకాలం నాటికి... నగరంలో నాలాల అభివృద్ధే లక్ష్యం' - ఎర్రగడ్డ తాజా వార్తలు

talasani on ghmc works: హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అందులో భాగంగానే భాగ్యనగరంలో ఉన్న పురాతనమైన నాలాలను తొలగించి అధునాతనమైన నాలాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఇందుకోసం కేటీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు.

talasani on ghmc works
పలు అభవృద్ధి పనులకు మంత్రి శంఖుస్థాపన

By

Published : Feb 10, 2022, 1:22 PM IST

talasani on ghmc works: ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ వద్ద గురువారం ఉదయం ఎస్​ఎన్​డీపీ కార్యక్రమంలో భాగంగా సుమారుగా 12.86 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే నాల అభివృద్ధి పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దేందుకు తెరాస ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. అందులో భాగంగానే భాగ్యనగరంలో ఉన్న పురాతనమైన నాలాలను తొలగించి అధునాతనమైన నాలాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఇందుకోసం కేటీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు.

'ఎర్రగడ్డలో సుమారుగా రూ.12.86 కోట్ల రూపాయలతో చేపట్టిన నాలా అభివృద్ధి పనులు ప్రారంభించాము. ఎర్రగడ్డ నుంచి కూకట్​పల్లి, ఎర్రగడ్డ నుంచి సనత్ నగర్ వరకు, అదేవిధంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనూ నాలా పనులు నిర్వహిస్తున్నాం. రానున్న వానాకాలం నాటికి హైదరాబాద్ నగరంలో నాలాల అభివృద్ధి పూర్తి చేయడమే మా లక్ష్యం. భాగ్యనగరంలో ఉన్న మారుమూల ప్రాంతాల్లోని నాలాలను అభివృద్ధి చేస్తున్నాం. ఇందుకోసం కావాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది.'

-తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి

ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:Patney Naala: ఈనెల 12న ప్యాట్నీ నాలా అభివృద్ధి పనులకు కేటీఆర్ శ్రీకారం

ABOUT THE AUTHOR

...view details