నాలా అక్రమాల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. భారీగా కురిసిన వర్షంతో వరద ముంపునకు గురైన హుస్సేన్ సాగర్ నాలా పరివాహక ప్రాంతాలను ఆయన సందర్శించారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పొరేటర్లు ముఠా పద్మా నరేశ్, హేమలత జయరాం రెడ్డి, జీహెచ్ఎంసీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు సంబంధించిన ప్రభుత్వ అధికారులు ఉన్నారు.
ఆ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది: తలసాని - మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తాజా వార్తలు హైదరాబాద్
హైదరాబాద్లో భారీ వర్షాల వల్ల ముంపునకు గురైన ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులు పర్యటించారు. నాలా అక్రమాల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ కూడా అక్రమ నిర్మాణాలపై సీరియస్గా ఉన్నారని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.
ముషీరాబాద్ నియోజకవర్గంలోని అరుంధతి నగర్, నాగమయ్య కుంట, పద్మా కాలనీలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. అరుంధతి నగర్, నాగమయ్య కుంట ప్రాంత ప్రజలు తమ సమస్యలను మంత్రికి విన్నవించారు. తమ ప్రాంతాలు ముంపునకు గురికావడానికి కారణం నాలాలను అక్రమంగా కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలని ఆరోపించారు. సీఎం కేసీఆర్ కూడా అక్రమ నిర్మాణాలపై సీరియస్గా ఉన్నారని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు, ప్రణాళికలు రూపొందిస్తోందని తలసాని వెల్లడించారు.
ఇదీ చదవండి:మూడోరోజు కేటీఆర్ పర్యటన.. జీహెచ్ఎంసీ అందిస్తున్న సౌకర్యాలపై ఆరా