పట్టభద్రుల ఎన్నికల్లో తెరాస కొత్త రికార్డు నెలకొల్పడం ఖాయమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని గాంధీనగర్ డివిజన్ హిమసాయి అపార్ట్మెంట్లో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను... ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస సరికొత్త రికార్డు: తలసాని - ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి తలసాని
హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస సరికొత్త రికార్డు: తలసాని
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా పార్టీ శ్రేణులు పక్కా ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. ఏ ఒక్క పట్టభద్రుని పేరు కూడా మిస్ కాకుండా నమోదు చేయించి, పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ ముఠా పద్మానరేష్, నాయకులు ఎంఎన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:హోం మంత్రి సమక్షంలోనే తెరాస నేతల బాహాబాహీ