హైదరాబాద్ వరదబాధితులకు 2వ విడతలో భాగంగా రూ.10వేల చెక్కులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేశారు. గోశామహల్ నియోజకవర్గ పరిధిలోని మచిపురా నాల, మంగలాట్లోని గంగబోలిలో ప్రభుత్వ ఆర్థిక సాయాన్ని గోశామహల్ కార్పొరేటర్ ముకేశ్ సింగ్, మంగలాట్ కార్పొరేటర్ పరమేశ్వరి సింగ్‌తో కలసి మంత్రి ఇంటింటికి తిరిగి బాధితులకు అందజేశారు.
'వరద బాధితులందరికీ ఆర్థిక సాయం చేస్తాం... ఎవరూ బాధపడకండి' - వరద బాధితులకు ప్రభుత్వ ఆర్థిక సాయం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లోమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. వరద బాధితులకు 2వ విడతలో భాగంగా రూ.10 వేల చెక్కులను ఇంటింటికి తిరిగి అందజేశారు. ప్రతిపక్షాలు లేనిపోని రాద్దాంతాలు చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు.
!['వరద బాధితులందరికీ ఆర్థిక సాయం చేస్తాం... ఎవరూ బాధపడకండి' 'వరదబాధితులందరికీ ఆర్థిక సాయం చేస్తాం... ఎవరూ బాధపడకండి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9451188-14-9451188-1604648128205.jpg)
పేద, మధ్యతరగతి ప్రజలు కరోనా నుంచి వరదల వరకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీఎం కేసీఆర్ గ్రహించి... దేశంలో ఎక్కడాలేని విధంగా మొట్టమొదటిసారి ఇంటింటికి రూ. 10వేలు ఇస్తున్నారని వివరించారు. గోశామహల్లోని ధూల్‌పేట్, మంగాల్హాట్లలో దేవుని ప్రతిమలు చేసుకుని రోజువారీ జీవితాన్ని గడుపుతారని... అటువంటి వారికి ఇంటింటికి ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ప్రతిపక్షాలు లేనిపోని రాద్దాంతాలు చేస్తున్నాయని మండిపడ్డారు.
ఇంత పెద్ద విపత్తు వస్తే కేంద్రం నుంచి కనీస సాయం కూడా తీసుకురాలేని వాళ్లు సైతం మాట్లాడుతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. వరద భాదితులందరికి ఇంటింటికి రూ.10 వేలు అందరికి అందజేస్తామని... ఎవరూ ఆవేదన చెందొద్దని మంత్రి సూచించారు.