గ్రేటర్ హైదరాబాద్‌లో నిర్మాణమవుతున్న రెండు పడక గదుల ఇళ్లను మంత్రి శ్రీనివాస్ యాదవ్... సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఆయన బృందానికి చూపిస్తున్నారు. నగరంలో లక్ష ఇళ్లు నిర్మించి ఇస్తామని తెరాస ఇచ్చిన హామీ నెరవేర్చలేదని మాటలకే పరిమితమవుతున్నారని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. ఇవాళ ఉదయం భట్టి నివాసానికి వెళ్లి.. ఆయనను తీసుకొని రెండు పడక గదుల ఇళ్లు నిర్మాణమవుతున్న ప్రాంతాలను చూపించారు.
భట్టికి డబుల్ బెడ్‌రూం ఇళ్లు చూపిస్తున్న తలసాని.. - డబుల్ బెడ్‌రూం ఇళ్లు చూస్తున్న భట్టి
హైదరాబాద్‌లో నిర్మిస్తోన్న రెండుపడక గదుల ఇళ్లను సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చూపిస్తున్నారు. జియాగూడ, గోడేకి ఖబర్, కట్టెల మండిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను చూపించారు. నిర్మాణంలో తీసుకున్న జాగ్రత్తలు, సౌకర్యాల గురించి కాంగ్రెస్ నేతలకు వివరించారు.
జియాగూడ, సీసీ నగర్, అంబేడ్కర్ నగర్ తదితర ప్రాంతాలలో తిరిగి ఇళ్లను పరిశీలించారు. సికింద్రబాద్ బన్సీలాల్‌పేటలో నిర్మాణమవుతున్న ఇళ్లను పరిశీలించారు. మంత్రితో పాటు జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కాంగ్రెస్ నేత వీహెచ్, అధికారులు ఉన్నారు. నగరంలో లక్ష ఇళ్లు నిర్మిస్తామని తెరాస చెప్పిందని ఇప్పటి వరకు సందర్శించిన ప్రాంతాల్లో దాదాపు మూడు వేలు మాత్రమే ఉన్నాయని భట్టి తెలిపారు. మంత్రి ఎన్ని ప్రదేశాల్లో చూపించిన తాము చూడడానికి సిద్ధంగా ఉన్నామని భట్టి వివరించారు.
ఇదీ చదవండి:పదా అన్న ఇళ్లు చూసివద్దాం... భట్టితో తలసాని