తెలంగాణ

telangana

ETV Bharat / city

'జంటనగరాల్లో 150 డివిజన్లలో సంచార చేపల మార్కెట్లు' - మంత్రి తలసాని వార్తలు

జంటనగరాల్లో 150 డివిజన్లలో సంచార చేపల మార్కెట్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మత్స్య రంగానికి పెద్దపీట వేస్తూ... దేశీయ, అంతర్జాతీయ ఎగుమతులు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

minister-talasani-srinivas-on-fishers-sector
'జంటనగరాల్లో 150 డివిజన్లలో సంచార చేపల మార్కెట్లు'

By

Published : Oct 9, 2020, 3:27 PM IST

రాష్ట్రంలో మత్స్య రంగానికి పెద్దపీట వేస్తూ... దేశీయ, అంతర్జాతీయ ఎగుమతులు ప్రోత్సాహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ పేర్కొన్నారు. హైదరాబాద్​లోని మాసబ్​ ట్యాంక్​ పశు సంక్షేమ భవన్​లో... సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ... ఉప ప్రాంతీయ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.

రాష్ట్రంలో పెరుగుతున్న మత్స్య సంపదతో... రాష్ట్ర, దేశీయ ఎగుమతుల అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. అరుదైన చేపల రకాలు, రొయ్యల సాగు ప్రోత్సహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తలసాని పేర్కొన్నారు. జంటనగరాల పరిధిలో త్వరలో 150 డివిజన్లలో సంచార చేపల మార్కెట్లు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు.

ఇదీ చూడండి:ఫిషరీస్​ యూనివర్సిటీ స్థాపనతో మత్స్య సంపద అభివృద్ధికి దోహదం

ABOUT THE AUTHOR

...view details