ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును ఘనంగా నిర్వహిస్తామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ జలవిహార్లో జన్మదిన వేడుకలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
'కేసీఆర్ పుట్టిన రోజున రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు' - cm kcr birthday celebrations at jalavihar in Hyderabad
ఫిబ్రవరి 17న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే కార్యక్రమాల గురించి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు. కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్ జలవిహార్లో ఘనంగా జరుపుతామని స్పష్టం చేశారు.
ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ బర్త్ డే
రెండున్నర కిలోల బంగారంతో తయారు చేయించిన చీరను బుధవారం రోజున ఉదయాన్నే ఎమ్మెల్సీ కవిత బల్కంపేట అమ్మవారికి సమర్పిస్తారని మంత్రి చెప్పారు. 300 మంది మహిళలకు చీరలు అందజేస్తామని తెలిపారు. మసీదు, చర్చి, మందిరాలు, గురుద్వారాల్లో ప్రత్యేక కార్యక్రమాలుంటాయని వెల్లడించారు.
రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాలతో పాటు త్రీడీలో కేసీఆర్ జీవిత చరిత్రపై డాక్యుమెంటరీ విడుదల చేస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు.
- ఇదీ చూడండి :'సేవాలాల్ మహరాజ్ హిందువులందరికీ ఆదర్శం'