తెలంగాణ

telangana

ETV Bharat / city

Accident: సదర్​ ఉత్సవాల్లో వ్యక్తి పైకి దూసుకెళ్లిన మంత్రి తలసాని కుమారుడి కారు - tlasani sai yadav car accident case

హైదరాబాద్​లోని ఖైరతాబాద్​లో వైభవంగా జరిగిన సదర్ ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఉత్సవాల్లో పాల్గొని వెళ్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ కుమారుని కారు.. ఓ స్థానికునిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బాధితుని కాలికి తీవ్రగాయమైంది.

tlasani sai yadav car accident case
tlasani sai yadav car accident case

By

Published : Nov 5, 2021, 10:59 PM IST

హైదరాబాద్ ఖైరతాబాద్ సదర్ ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. దీపావళి పండుగను పురస్కరించుకుని నిర్వహించే సదర్ ఉత్సవాల్లో... మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి యాదవ్ హాజరయ్యారు. వేడుకల్లో పాల్గొన్ని తిరిగి వెళ్తుండగా... ఉత్సవాలను తిలకించడానికి వచ్చిన ఓ వ్యక్తి కాలుపై నుంచి కారు వెళ్లింది.

ఈ ఘటనలో కాలుకు తీవ్ర గాయం కాగా.. మంత్రి కుమారున్ని స్థానికులు అడ్డుకున్నారు. సాయియాదవ్​తో బాధితుని కుటుంబసభ్యులు, స్థానికులు వాగ్వాదానికి దిగారు. గొడవ తీవ్రం కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. బాధితుని కుటుంబానికి నచ్చ చెప్పిన పోలీసులు.. తమ వాహనంలోనే క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించారు.

సదర్​ ఉత్సవాల్లో వ్యక్తి పైకి దూసుకెళ్లిన మంత్రి తలసాని కుమారుడి కారు

ABOUT THE AUTHOR

...view details