జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతితో పశుసంవర్ధక శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. లాక్డౌన్ కారణంగా హైదరాబాద్లో చిక్కుకుపోయిన వలస కార్మికులందరికీ బియ్యం, నగదు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వలస కూలీలు, తెల్లరేషన్ కార్డుదారులకు.. బియ్యం, నగదు పంపిణీపై చర్చించారు. గ్రేటర్ పరిధిలో ఇప్పటి వరకు 35వేల మంది వలస కూలీలకు బియ్యం, నగదు పంపిణీ పూర్తైందని... ఇంకా లక్షా 38 వేల మందికి బియ్యం అందాల్సి ఉందని మంత్రి తెలిపారు. ఇదే విషయాన్ని సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తలసాని చెప్పారు. వారికి కూడా బియ్యం అందే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.