రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో అపార ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించినందునే విద్యాధికులు ఓటేసి ప్రభుత్వానికి మద్దతు తెలిపారని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి చూసి పట్టభద్రులు తెరాస ప్రభుత్వాన్ని ఆశీర్వదించారని పేర్కొన్నారు.
'అభివృద్ధి చూసే పట్టభద్రులు తెరాసను ఆశీర్వదించారు' - తెలంగాణ పట్టభద్రు ఎమ్మెల్సీ ఫలితాలు
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసే పట్టభద్రులు తెరాస సర్కార్ను ఆశీర్వదించారని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఏ నమ్మకంతో ఓటేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని హామీ ఇచ్చారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
విద్యావంతులు, మేధావుల నమ్మకాన్ని నిలబెట్టేలా మరింత బాధ్యతతో పనిచేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి రౌండ్లో తెరాసకే మెజార్టీ వచ్చిందని తెలిపారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో విజయకేతనం ఎగురవేసిన అభ్యర్థి సురభి వాణీదేవికి మంత్రి తలసాని అభినందనలు తెలిపారు.