తెలంగాణ

telangana

ETV Bharat / city

పౌల్ట్రీ ప్రదర్శనలో మంత్రికి నిరసన సెగ - international poultry exhibition latest news

హైటెక్స్​ 13 వ పౌల్ట్రీ ఎగ్జిబిషన్​లో మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ పాల్గొన్నారు. పలు కంపెనీలు ఏర్పాటుచేసిన స్టాల్స్​ను పరిశీలించారు. పౌల్ట్రీ రంగాన్ని ఆదుకునేందుకు కృషిచేసున్నామన్నారు. ఎగ్​ బోర్డు, ఇతర సమస్యలపై కోళ్ల రైతులు నిరసన తెలిపారు.

minister talasani participated international poultry exhibition
పౌల్ట్రీ ప్రదర్శనకు మంత్రి శ్రీనివాస్​యాదవ్​.. రైతుల నిరసన

By

Published : Nov 27, 2019, 10:29 PM IST

పౌల్ట్రీ ప్రదర్శనకు మంత్రి శ్రీనివాస్​యాదవ్​.. రైతుల నిరసన

తెలంగాణలో పౌల్ట్రీ పరిశ్రమను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్​ హైటెక్స్​లో పౌల్ట్రీ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలు కంపెనీలు ఏర్పాటుచేసిన స్టాల్స్​ను పరిశీలించారు. పౌల్ట్రీ రంగాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్​ కృత నిశ్చయంతో ఉన్నారని.. కేబినెట్​ ఉపసంఘాన్ని నియమించారని మంత్రి తెలిపారు.

రైతుల నినాదాలు

పౌల్ట్రీ ఎగ్జిబిషన్​కు హాజరైన కొందరు రైతులు తమను ఆదుకోవాలంటూ ప్లకార్టు ప్రదర్శించారు. ఎగ్​ బోర్డు ఏర్పాటుచేయాలని నినాదాలు చేశారు. దాణా పంపిణీలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఇలాంటి ప్రతిష్టాత్మక ఎగ్జిబిషన్​లో నిరసనలు మంచిది కాదని మంత్రి శ్రీనివాస్​యాదవ్​ వారించారు.

ఇవీచూడండి: హైటెక్స్​లో ఈ నెల 27 నుంచి పౌల్ట్రీ ఇండియా ప్రదర్శన

ABOUT THE AUTHOR

...view details