మంత్రి తలసాని, మేయర్, ఎమ్మెల్యే దానంకు జీహెచ్ఎంసీ జరిమానాలు - మేయర్‌కు జీహెచ్ఎంసీ జరిమానా
18:32 October 28
మంత్రి తలసాని, మేయర్, ఎమ్మెల్యే దానంకు జీహెచ్ఎంసీ జరిమానాలు
వారం రోజుల తర్వాత జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం తిరిగి అందుబాటులోకి వచ్చింది. అందుబాటులోకి వచ్చిన తక్షణమే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ఇటీవల జరిగిన తెరాస ప్లీనరీ సందర్భంగా పలువురు ప్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించిన ఫొటోలను పౌరులు ట్విట్టర్లో పంచుకున్నారు. స్పందించిన ఈవీడీఎం విభాగం జరిమానాలు విధించింది.
రూ.5వేలు మొదలుకుని రూ.25వేల వరకు జరిమానాలు విధించింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మి, తెరాస ప్రధాన కార్యదర్శి తదితరులకు జరిమానాలు విధించినట్లు వాటికి సంబంధించిన రశీదులను ఈవీడీఎం విభాగం ట్విట్టర్ వేదికగా పంచుకుంది. ప్లెక్సీలు, కటౌట్ల వల్ల నగర పౌరులకు కలిగిన అసౌకర్యం, ఇబ్బందులను, ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని ఈ జరిమానాలు విధించినట్లు జీహెచ్ఎంసీ తెలిపింది.
ఇదీ చదవండి :'ఫ్లెక్సీలకు అనుమతి ఉందా.. ఎంత వసూలు చేసారో చెప్పండి'