తెలంగాణ

telangana

ETV Bharat / city

Talasani Srinivas Yadav: నాలా పనులు పరిశీలించిన మంత్రి తలసాని

Talasani Srinivas Yadav: ముషీరాబాద్ నియోజకవర్గంలోని నాలా విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ మళ్లింపు, పనుల్లో నాణ్యత పాటించాలని మంత్రి సూచించారు.

Talasani Srinivas Yadav
Talasani Srinivas Yadav

By

Published : Apr 4, 2022, 12:00 PM IST

Talasani Srinivas Yadav: ముషీరాబాద్ నియోజకవర్గంలోని నాగమయ్య కుంట, పద్మ కాలనీ హెరిటేజ్ భవన్ సమీపంలో చేపట్టిన నాలా విస్తరణ పనులను రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. నాలా విస్తరణ నేపథ్యంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ డైవర్షన్ పనుల్లో నాణ్యత పాటించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పొరేటర్ సునీత ప్రకాష్ గౌడ్, తదితరులు పాల్గొని ఆయా పనులను పర్యవేక్షించారు.

నాలా పనులను పరిశీలిస్తున్న మంత్రి తలసాని

ABOUT THE AUTHOR

...view details