ప్రపంచంలో అనేక మంది ధనికులున్నారు.. విపత్కర సమయంలో ఆదుకుంటేనే ప్రజలు వారిని జీవితాంతం గుర్తు పెట్టుకుంటారని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభిప్రాయపడ్డారు. అంబర్‌పేట ఎమ్మెల్యే కాలే వెంకటేశ్‌తో కలిసి 500 మందికి నిత్యావసరాలు పంపిణీ చేశారు. రాష్ట్రంలో కరోనా నివారణకు పోలీసు, వైద్య, పారిశుద్ధ్య, ఇతర ప్రభుత్వ సిబ్బంది చేస్తున్న కృషిని మంత్రి అభినందించారు. ప్రజలందరూ భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు బయటకు రాకుండా ప్రభుత్వానికి సహకరించాలని తలసాని విజ్ఞప్తి చేశారు.
సాయం చేస్తేనే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు: తలసాని - minister talasani
అంబర్‌పేట ఎమ్మెల్యే కాలే వెంకటేశ్ ఆధ్వర్యంలో మంత్రి తలసాని చేతుల మీదుగా 500 మందికి నిత్యావసరాల పంపిణీ చేశారు. రాష్ట్రంలో కరోనా నివారణకు పోలీసు, వైద్య, పారిశుద్ధ్య, ఇతర ప్రభుత్వ సిబ్బంది చేస్తున్న కృషిని మంత్రి అభినందించారు.
సాయం చేస్తేనే ప్రజలు గుర్తపెట్టుకుంటారు: తలసాని