కరోనా వంటి మహమ్మారి చాప కింద నీరులా వ్యాపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి తలసాని హితవు పలికారు. విపత్కర పరిస్థితుల్లోనూ రాజకీయం చేయడం తగదన్నారు. కరోనా వచ్చిన 40 రోజులకు కాంగ్రెస్ నాయకులు నిద్రలేచారని విమర్శించారు.
'కరోనా వచ్చిన 40 రోజులకు కాంగ్రెస్ నిద్రలేచింది' - minister talasani fires on bjp
కరోనా వచ్చిన 40 రోజులకు కాంగ్రెస్ నాయకులు నిద్రలేచారని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. భాజపా నాయకులు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని స్పష్టం చేశారు.
'కరోనా వచ్చిన 40 రోజులకు కాంగ్రెస్ నిద్రలేచింది'
భాజపా చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని మంత్రి తలసాని స్పష్టం చేశారు. వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చేందుకు రైళ్లు ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. గురువారం రాత్రి బల్లార్షకు, నేడు ఉదయం రాంచీకి ప్రత్యేక రైళ్లు వెళ్లాయని చెప్పారు. ఈ కష్టకాలంలో ప్రభుత్వానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు.