పండుగలను ప్రభుత్వాలు నిర్వహించే చరిత్ర తెలంగాణలో మాత్రమే ఉందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్పేటలో క్రిస్మస్ కానుకల పంపిణీ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. క్రిస్టియన్ సోదరులు పండుగను ఆనందంగా జరుపుకోవాలనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు. అన్ని మతాల సంప్రదాయాలను గౌరవించడమే తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు
కుల మతాలకు అతీతంగా పాలన: తలసాని - అన్ని మతాల సంప్రదాయాలను గౌరవించడమే తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశం
అన్ని మతాల సంప్రదాయాలను గౌరవించడమే తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్పేటలో క్రిస్మస్ కానుకలను మంత్రి పంపిణీ చేశారు.
కిస్మస్ కానుకలు పంపిణీ చేసిన మంత్రి తలసాని