హైదరాబాద్ నగరం చుట్టూ గత ఆరేళ్లలో తెరాస ప్రభుత్వం చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తుందని మంత్రి తలసాని ధీమా వ్యక్తం చేశారు. భాగ్ అంబర్పేట తెరాస అభ్యర్థి పద్మావతి రెడ్డిని మరొకసారి గెలిపించి.. జరుగుతున్న అభివృద్ధిని కొనసాగించాలని కోరారు. కార్పొరేటర్ అభ్యర్థి పద్మావతి రెడ్డితో కలిసి మంత్రి తలసాని, ఎమ్మెల్యేలు హర్షవర్ధన్ రెడ్డి, కాలేరు వెంకటేశ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
మేము చేసిన అభివృద్దే మమ్మల్ని గెలిపిస్తుంది: తలసాని - జీహెచ్ఎంసీ ఎన్నికలు 202
గ్రేటర్ పోరులో భాగంగా తెరాస ఎన్నికల ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది. గెలుపే లక్ష్యంగా మంత్రులు అభివృద్ధి మంత్రాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. భాగ్ అంబర్పేటలో తెరాస అభర్థి పద్మావతి రెడ్డికి మద్దతుగా మంత్రి తలసాని ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
మేము చేసిన అభివృద్దే మమ్మల్ని గెలిపిస్తుంది: తలసాని
మంత్రి కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా కొనసాగుతూ గ్రేటర్ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. రోడ్ల అనుసంధానం, ఎల్ఈడీ లైట్లు, తాగునీటి సమస్యలకు పరిష్కారం వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని వివరించారు. విపత్తుల సమయంలో ప్రజలకు అండగా తెరాస తప్ప మరే ఇతర పార్టీ నిలబడలేదన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో తాము చేసిన అభివృద్ధే తెరాసను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి:తెరాస గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల... ముఖ్యాంశాలివే