తెలంగాణ

telangana

ETV Bharat / city

మనవడితో కలిసి టపాసులు కాల్చిన మంత్రి - మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ తాజా వార్తలు

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మారేడుపల్లిలోని తన నివాసంలో కుటుంబ సమేతంగా దీపావళి సంబురాల్లో పాల్గొన్నారు. తన మనవడితో సంతోషంగా గడిపారు. ప్రజలు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

minister talasani burn the crackers along with his grandson at marredpally
మనవడితో కలిసి టపాసులు కాల్చిన మంత్రి

By

Published : Nov 15, 2020, 5:10 AM IST

రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మారేడుపల్లిలోని తన నివాసంలో కుటుంబ సమేతంగా దీపావళి సంబురాలు జరుపుకున్నారు. తన మనవడు, కుటుంబ సభ్యులతో టపాసులు కాల్చుకుంటూ సంబురాలు చేసుకున్నారు. దీపావళి సందర్భంగా పాడిపంటలతో.. రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి కోరుకున్నారు.

లక్ష్మిదేవి పూజతో అందరికి సిరి సంపదలు కలగాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఏడాది కరోనా వల్ల దేశ వ్యాప్తంగా ప్రజలకు అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయని అన్నారు. ఒక వైపు కరోనా మరో వైపు వరదలు రావడం వల్ల ఈ ఏడాది ఘోరమైన పరిస్థితి ఏర్పడిందన్నారు. అయినప్పటికీ ప్రజలు పండుగలు సంతోషంగా జరుపుకోవాలన్నారు.

ఇదీ చూడండి:పండుగ వేళ ప్రమాదం... ఆహుతైన 1200 కోళ్లు

ABOUT THE AUTHOR

...view details