తెలంగాణ

telangana

ETV Bharat / city

'సృష్టిలో తల్లి ప్రేమ ఎంతో గొప్పది'

సృష్టిలో తల్లి ప్రేమ ఎంతో గొప్పదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా.. మాతృమూర్తులకు శుభాకాంక్షలు తెలిపారు.

minister srinivas goud
మంత్రి శ్రీనివాస్ గౌడ్

By

Published : May 9, 2021, 7:42 PM IST

అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తులకు శుభాకాంక్షలు తెలిపారు. సృష్టిలో తల్లి ప్రేమ ఎంతో గొప్పదని కొనియాడారు. తన మాతృమూర్తి శాంతమ్మ ఆశీస్సులు తీసుకున్నారు.

మహిళలు, మాతృమూర్తుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు పరుస్తోన్న పలు అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు మంత్రి. తల్లి నుంచి.. ఓర్పు, సహనం, ప్రేమ, త్యాగం వంటి ఎన్నో సుగుణాలను నేర్చుకుంటామని వివరించారు.

ఇదీ చదవండి:ఏ తల్లైనా.. బిడ్డ నుంచి ఆశించేది కాస్తంత ప్రేమే!

ABOUT THE AUTHOR

...view details