హైదరాబాద్ నగరానికి తలమానికంగా రూపుదిద్దుకుంటున్న దుర్గం చెరువు బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరలో పూర్తవుతాయని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బ్రిడ్జి ప్రారంభించిన తరువాత పర్యాటక శాఖ ఆధ్వర్యంలో దుర్గం చెరువులో అత్యాధునిక రెస్టారెంట్, బోటింగ్ సదుపాయాలను కల్పించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
'కుటుంబంతో ఆహ్లాదంగా గడిపేలా దుర్గం చెరువులో సదుపాయాలు' - hyderabad news
పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. కుటుంబంతో రోజంతా ఆహ్లాదంగా గడిపేలా దుర్గం చెరువు వద్ద సదుపాయాలు కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. అత్యాధునిక రెస్టారెంట్, బోటింగ్ సదుపాయాలను కల్పిచనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
!['కుటుంబంతో ఆహ్లాదంగా గడిపేలా దుర్గం చెరువులో సదుపాయాలు' 'కుటుంబంతో ఆహ్లాదంగా గడిపేలా దుర్గం చెరువు నిర్మాణం'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8695269-949-8695269-1599324417815.jpg)
'కుటుంబంతో ఆహ్లాదంగా గడిపేలా దుర్గం చెరువు నిర్మాణం'
పర్యాటకులు కుటుంబంతో వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణంలో రోజంతా గడిపేలా కార్యక్రమాలను రూపొందించేందుకు తగిన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామన్నారు. ఉన్నతాధికారులతో కలిసి దుర్గం చెరువును మంత్రి సందర్శించారు. రాష్ట్రంలో సినిమా, సీరియల్ల షూటింగ్లు జరుపుకునేందుకు అవసరమైన సాయ సహకారాలు పర్యాటక శాఖ నుంచి అందిస్తామని మంత్రి తెలిపారు.