ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో పర్యావరణ క్షీణతపై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. రోజు రోజుకూ పర్యావరణం కలుషితమవుతోందని ఆయన అన్నారు. దేశ రాజధాని గాలిని కొనుగోలు చేసే దుస్థితి ఏర్పడిందన్నారు. దీనివల్ల మానవజాతే అంతరించిపోయే ప్రమాదం పొంచి ఉందని ఆయన తెలిపారు.
నగర ప్రజలవల్లే...
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక హరితహారంలో భాగంగా రాష్ట్రంలో పెద్ద మొత్తంలో మొక్కలు నాటామని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ప్లాస్టిక్ వినియోగం, చెట్ల నరికివేత వల్ల పర్యావరణం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాపాతం, నదులు ఉన్నా... త్రాగడానికి నీరులేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నగర ప్రజల వల్లే పర్యావరణం ఎక్కువగా పాడవుతోందని మంత్రి అన్నారు. 30 రోజుల గ్రామ ప్రణాళిక ద్వారా ప్రతీ గ్రామాన్ని పరిశుభ్రం చేసుకున్నామని తెలిపారు. భారతదేశంలోనే ప్రతి ఇంటికి తాగునీరు ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినప్పటికీ... ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది మేధావులేనని మంత్రి స్పష్టం చేశారు.
ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది మేథావులే: శ్రీనివాస్ గౌడ్ ఇవీ చూడండి;'హయత్ నగర్లో చెడ్డి గ్యాంగ్ హల్ చల్... 3 ఇళ్లల్లో చోరీ'