తెలంగాణ

telangana

ETV Bharat / city

ఓ వృద్ధురాలు.. బతికుంటే తెరాసకే ఓటు వేస్తానంది: శ్రీనివాస్​గౌడ్​ - ghmc election updates

గ్రేటర్​ హైదరాబాద్​ ఎన్నికల్లో తెరాస వందకు పైగా సీట్లు సాధించడం ఖాయమని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్​గౌడ్​ జోస్యం చెప్పారు. అడిక్​మెట్​ డివిజన్​లోని నాగమయ్య కుంటలో ప్రచారం సందర్భంగా.. పోలింగ్ తేదీ వరకు బతికి ఉంటే తప్పనిసరిగా కారు గుర్తుకే ఓటు వేస్తానని ఓ వృద్ధురాలు చెప్పడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు.

srinivas goud campaign
ఓ వృద్ధురాలు.. బతికుంటే తెరాసకే ఓటువేస్తానంది: శ్రీనివాస్​గౌడ్​

By

Published : Nov 22, 2020, 5:13 PM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో తెరాస వందకు పైగా సీట్లు గెలవడం ఖాయమని రాష్ట్ర ఎక్సైజ్​ శాఖ మంత్రి శ్రీనివాస్​గౌడ్​ ధీమావ్యక్తం చేశారు. హైదరాబాద్​ పరిధిలోని అడిక్​మెట్​ డివిజన్​లోని నాగమయ్య కుంట, మేడి బాయ్ బస్తీల్లో ఆయన తెరాస అభ్యర్థి జయరామిరెడ్డి తరఫున ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కారు గుర్తుకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. అన్ని డివిజన్లలో తెరాసకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని శ్రీనివాసగౌడ్​ తెలిపారు.

పోలింగ్ తేదీ వరకు బతికి ఉంటే తప్పనిసరిగా కారు గుర్తుకే ఓటు వేస్తానని ఓ వృద్ధురాలు చెప్పడం తనను ఎంతో ఆనందానికి గురిచేసిందని ఆయన పేర్కొన్నారు.

ఓ వృద్ధురాలు.. బతికుంటే తెరాసకే ఓటువేస్తానంది: శ్రీనివాస్​గౌడ్​

ఇవీచూడండి:'ఓటేయకుండా ప్రశ్నించే, విమర్శించే హక్కు ఏ పౌరునికి లేదు'

ABOUT THE AUTHOR

...view details