తెలంగాణ

telangana

ETV Bharat / city

పాపన్న గౌడ్​ విగ్రహానికి నివాళులు అర్పించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ - సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్

సర్ధార్​ సర్వాయి పాపన్న గౌడ్​ 370 వ జయంతిని... హైదరాబాద్​ చిక్కడపల్లి బ్రిడ్జి వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ హాజరై నివాళులు అర్పించారు.

minister srinivas goud participated in sardhar  sarvai papanna goud birth anniversary
పాపన్న గౌడ్​ విగ్రహానికి నివాళులు అర్పించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

By

Published : Aug 18, 2020, 6:32 PM IST

బడుగు, బలహీన వర్గాల సంక్షేమంతో పాటు కుల వృత్తిదారుల ఆత్మగౌరవం కాపాడే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సర్దార్ సర్వాయి పాపన్న 370వ జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్ చిక్కడపల్లి బ్రిడ్జి వద్ద తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ కులస్థులకే పరిమితం కాదని... బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేసిన గొప్ప నాయకుడని మంత్రి కొనియాడారు. అనేక మంది రాజులతో యుద్ధాలు చేసి... ధనాన్ని పేదలకు పంచారని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఛైర్మన్ బాలరాజ్​ గౌడ్​, నాయకులు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details