తెలంగాణ

telangana

ETV Bharat / city

పీఆర్సీపై తుది నిర్ణయం ముఖ్యమంత్రిదే: శ్రీనివాస్ గౌడ్

ఉద్యోగుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని పీఆర్సీపై సీఎం కేసీఆర్​ నిర్ణయం తీసుకుంటారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. పీఆర్సీ కమిటీ నివేదికలో ఏమి ఉన్నప్పటికీ.. తుది నిర్ణయం ముఖ్యమంత్రిదేనని స్పష్టం చేశారు. మొదటి పీఆర్సీలో ఉద్యోగులు అడిగిన దానికంటే ఎక్కువే కేసీఆర్‌ ఇచ్చారని గుర్తు చేశారు.

Minister Srinivas Goud on PRC at Ravlindra Bharathi in Hyderabad
పీఆర్సీపై తుది నిర్ణయం ముఖ్యమంత్రిదే: శ్రీనివాస్ గౌడ్

By

Published : Jan 27, 2021, 1:03 PM IST

Updated : Jan 27, 2021, 4:33 PM IST

పీఆర్సీ నివేదికను చూసి ఆందోళన చెందవద్దని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ అన్నారు. ఉద్యోగులతో సంప్రదింపులు జరిపిన తరువాతే.. వారిని సంతృప్తి పరిచేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం ప్రకటిస్తారని స్పష్టం చేశారు. మొదటి పీఆర్సీలో ఉద్యోగులు అడిగిన దానికంటే ఎక్కువే కేసీఆర్‌ ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ విశ్రాంత గెజిటెడ్ అధికారుల సంఘం రూపొందించిన నూతన సంవత్సర కాలమానిని, తెలంగాణ గ్రూప్‌-1 అధికారుల సంఘం డైరీ-2021ని హైదరాబాద్ రవీంద్రభారతిలో మంత్రి ఆవిష్కరించారు.

ప్రయోజనాల దృష్ట్యా..

ఉద్యోగుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని పీఆర్సీపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని మంత్రి పేర్కొన్నారు. గతంలో ఏమీ అడగకపోయినా 43శాతం ఇచ్చారని.. అదేవిధంగా ప్రస్తుతం కచ్చితంగా ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తగు నిర్ణయం తీసుకుంటారాని తెలిపారు. నేడు జరుగుతున్న పీఆర్సీ సమావేశంలో విశ్రాంత ఉద్యోగుల, అధికారుల సమస్యలను కమిటీ దృష్టికి తీసుకెళ్తామని మంత్రి స్పష్టం చేశారు.

ఉద్యోగులు అర్థం చేసుకోవాలి:

"అందరికీ పదోన్నతులు ఇవ్వాలన్న కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఈ నెల 31లోపు పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు. కరోనా వల్ల పీఆర్స్ కొంత ఆలస్యమైంది. ప్రభుత్వాన్ని ఉద్యోగులు అర్థం చేసుకోవాలి. ఇతర రాష్ట్రాల మాదిరిగా రాష్ట్రంలోని అధికారులందరికీ పదోన్నతులు కల్పించేందకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉద్యోగులు, ప్రజలను ఇబ్బందులకు గురిచేసే ఉన్నతాధికారులు ఏ స్థాయిలో ఉన్నా ఉపేక్షించేది లేదు. "

-శ్రీనివాస్‌ గౌడ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి

ఇదీ చూడండి: తెలంగాణలో మరో 147 కరోనా కేసులు.. ఒకరు మృతి

Last Updated : Jan 27, 2021, 4:33 PM IST

ABOUT THE AUTHOR

...view details