తెలంగాణ

telangana

ETV Bharat / city

'దేశంలో లేని క్రీడా పాలసీని రాష్ట్రంలో తీసుకొస్తాం' - sports day celebrations

హైదరాబాద్ గచ్చిబౌలి హాకీ స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారంతో పాటు వ్యాయామం అత్యంత ముఖ్యమని సూచించారు.

minister srinivas goud on news sports policy
minister srinivas goud on news sports policy

By

Published : Aug 29, 2020, 12:37 PM IST

దేశంలో లేని క్రీడా పాలసీని రాష్ట్రంలో తీసుకువస్తామని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట్రంలో క్రీడారంగాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి హాకీ స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

'దేశంలో లేని క్రీడా పాలసీని రాష్ట్రంలో తీసుకొస్తాం'

మామూలు స్థాయి నుంచి వచ్చిన ధ్యాన్​చంద్... ఒలింపిక్స్​లో బంగారు పథకాలు సాధించాడని మంత్రి కొనియాడారు. సామాన్యుడు పట్టుదలతో ఆడితే ఏదైనా సాధిస్తాడనడానికి ఉదాహరణ ధ్యాన్​చంద్ అని వివరించారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారంతో పాటు వ్యాయామం అత్యంత ముఖ్యమని సూచించారు.

ఇదీ చూడండి :ఆర్థిక ఇబ్బందులు తాళలేక బిడ్డను అమ్ముకున్న తల్లి

ABOUT THE AUTHOR

...view details