తెలంగాణ

telangana

By

Published : Sep 9, 2020, 6:59 PM IST

ETV Bharat / city

కొత్త రెవెన్యూ చట్టంతో ప్రజలకెంతో మేలు : మంత్రి శ్రీనివాస్ గౌడ్

కొత్త రెవెన్యూ చట్టంతో రాష్ట్రంలోని ప్రజలు, ఉద్యోగులందరూ సంతోషంగా ఉన్నారని మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ తెలిపారు. కొత్త చట్టం వల్ల ఏ ఉద్యోగికి అన్యాయం జరగదని చెప్పారు. తెరాస ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతని పేర్కొన్నారు.

srinivas goud
srinivas goud

కొత్త రెవెన్యూ చట్టంతో ప్రజలకు మేలు జరుగుతుందని ఆబార్కీ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. పాత చట్టం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఆయన పేర్కొన్నారు. టీఎన్‌జీవో, రెవెన్యూ ఉద్యోగుల సంఘాల నేతలతో మంత్రి సమావేశమయ్యారు. ఉద్యోగ సంఘాల నేతలందరూ కొత్త రెవెన్యూ చట్టంపై హర్షం వ్యక్తం చేశారని మంత్రి చెప్పారు. కొత్త రెవెన్యూ చట్టం బిల్లును అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టడం చరిత్రత్మాకమైన సంఘటనగా అభివర్ణించారు.

కొత్త రెవెన్యూ చట్టం వల్ల రాష్ట్ర ప్రజలు, ఉద్యోగులందరూ సంతోషంగా ఉన్నారని మంత్రి తెలిపారు. ఈ చట్టం వల్ల ఏ ఉద్యోగికి అన్యాయం జరగదని చెప్పారు. తెరాస ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతని పేర్కొన్నారు. వీఆర్వోలకు ఇతర విభాగాల్లో అవకాశం ఇవ్వడం వల్ల వారికి ఉద్యోగ భద్రత కలిగిందన్నారు. కొత్త చట్టం వస్తే ఉద్యోగాలు తీసేస్తారని కొందరు అపోహలు సృష్టించారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ధన్యవాదాలు తెలిపారు.

కొత్త రెవెన్యూ చట్టంతో ప్రజలకు మేలు : మంత్రి శ్రీనివాస్ గౌడ్

ABOUT THE AUTHOR

...view details