కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రతి ఒక్కరు వినాయకచవితి వేడుకలను ఇళ్లలోనే జరుపుకోవాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో... హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో 1001 సీడ్ గణేశ్ విగ్రహాలతో పాటు రియల్ ఫ్రూట్ జ్యాస్‌ను మంత్రి ఉచితంగా పంపిణీ చేశారు. కొంత మంది పనికట్టుకొని ద్రుష్పచారం చేస్తున్నారని... ఇంట్లో వాళ్లకు కరోనా వస్తే ఆ బాధ అర్థమవుతుందని మంత్రి మండిపడ్డారు. మట్టి వినాయకులను పూజిస్తే పుణ్యంతో పాటు పర్యావరణానికి ఎలాంటి హాని జరగకుండా ఉంటుందన్నారు.
'వినాయక చవితిని ఇంట్లోనే చేసుకుందాం... భద్రంగా ఉందాం' - corona effect
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో... ఎల్బీ స్టేడియంలో 1001 సీడ్ గణేశ్ విగ్రహాలతో పాటు రియల్ ఫ్రూట్ జ్యాస్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉచితంగా పంపిణీ చేశారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రతి ఒక్కరు వినాయకచవితి వేడుకలను ఇళ్లలోనే జరుపుకోవాలని సూచించారు. మట్టి వినాయకులను పూజిస్తే పుణ్యంతో పాటు పర్యావరణానికి ఎలాంటి హాని జరగకుండా ఉంటుందన్నారు.
సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన హరితహారం కార్యక్రమం ద్వారా ఆరేళ్ల నుంచి వర్షాలు బాగా పడుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడుకుంటే... మనల్ని ఆ పర్యావరణం పరిరక్షిస్తోందన్నారు. కరోనా వచ్చిందని ఎవ్వరినీ చులకనగా చూడవద్దని... వైరస్‌తో ఎవరైనా మరణిస్తే మానవత్వంతో అంత్యక్రియలు చేయాలని మంత్రి సూచించారు.
కార్యక్రమంలో మంత్రితో పాటు క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, క్రీడా ప్రాధికార సంస్థ, క్రీడా శాఖా ప్రిన్సిపాల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, షూటర్ ఈషా సింగ్, బాక్సర్ నిఖత్ జరీన్, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.