వైకల్యం శరీరానికి తప్ప మనుసుకు కాదన్న సత్యాన్ని గుర్తించి.. దివ్యాంగులు తమ జీవితంలో ముందుకు వెళ్లాలని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం నుంచి రవీంద్రభారతి వరకు దివ్యాంగుల హక్కుల వేదిక దివ్యాంగుల అవగాహన నడక కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారితో కలసి రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు.
వైకల్యం శరీరానికి తప్ప మనసుకు కాదు: మంత్రి శ్రీనివాస్ గౌడ్ - Disability Awareness Walk Program updates
ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా దివ్యాంగుల హక్కుల వేదిక అవగాహన నడకను నిర్వహించింది. ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారితో కలసి రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు.
![వైకల్యం శరీరానికి తప్ప మనసుకు కాదు: మంత్రి శ్రీనివాస్ గౌడ్ Minister Srinivas Goud on Disability Awareness Walk Program](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9749145-521-9749145-1606988945426.jpg)
వైకల్యం శరీరానికి తప్ప మనుసుకు కాదు: మంత్రి శ్రీనివాస్ గౌడ్
ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రవీంద్రభారతిలో దివ్యాంగులకు మంత్రి దుప్పట్లు పంపిణీ చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దివ్యాంగులకు నెలకు రూ.3,016 ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి పేర్కొన్నారు. దివ్యాంగుల భవనం ఏర్పాటు విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళతానని శ్రీనివాస్ గౌడ్ వారికి హామీ ఇచ్చారు. భవిష్యత్తులో వారి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: రానున్న శాసనసభ ఎన్నికల్లో గెలుస్తాం: రజనీ
Last Updated : Dec 3, 2020, 6:08 PM IST