కొవిడ్ కారణంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న కళాకారులను ఆదుకునే ఉద్దేశంతో స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఫినిక్స్ ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. దాదాపు 100 మందికి పైగా కళాకారులు పాల్గొన్న ఈ ప్రదర్శనలో పెయింటింగ్, ఫొటోగ్రఫీ, శిల్పకళ తదితర అద్భుతాలను ప్రదర్శిస్తున్నారు.
ఆర్ట్ గ్యాలరీని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని మంత్రి కోరారు. ఎనిమిది రాష్ట్రాల నుంచి కళాకారులు ఇక్కడికి వచ్చి ప్రదర్శనలు చేపట్టారని పేర్కొన్నారు. హ్యాండీ క్రాఫ్ట్ మేళా త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.