ఖతర్‌లో జరిగిన 14వ ఏషియన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో రైఫిల్ షూటింగ్లో బంగారు పతకం సాధించి.. హైదరాబాద్ చేరుకున్న అబిద్ అలీఖాన్‌కు విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అబిద్‌ను ఘనంగా సత్కరించారు. తెలంగాణ నుంచి ఐదుగురు క్రీడాకారులు వివిధ స్థాయిల్లో పతకాలు సాధించడం గర్వకారణమన్నారు. తెలంగాణకు వన్నె తెచ్చేందుకు.. మరింత మంది క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నామన్నారు.
ఏషియన్ ఛాంపియన్షిప్ బంగారు పతక విజేతకు మంత్రి సత్కారం - 14th Asian championship winners from telangana
ఖతర్‌లో జరిగిన 14వ ఏషియన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో రైఫిల్ షూటింగ్లో బంగారు పతకం సాధించి.. హైదరాబాద్ చేరుకున్న అబిద్ అలీఖాన్‌ను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సత్కరించారు.
ఏషియన్ ఛాంపియన్షిప్ బంగారు పతక విజేతకు మంత్రి సత్కారం
పతకం సాధించడానికి తల్లిదండ్రుల ప్రోత్సాహమే కారణమని బంగారు పతక విజేత అబిత్ అలీ ఖాన్ అన్నారు. తన విజయాన్ని వారికి అంకితం చేస్తున్నానని తెలిపారు.
ఇవీచూడండి: మరోసారి సింధు విఫలం.. కశ్యప్ ఇంటిముఖం