తెలంగాణ

telangana

ETV Bharat / city

Minister Sidiri Appalaraju: మంత్రి సీదిరి అప్పలరాజు వివాదాస్పద వ్యాఖ్యలు - మంత్రి సీదిరి అప్పలరాజు వార్తలు

Minister Sidiri Appalaraju: ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైకాపా నేతల మాట వినకపోతే తెదేపా సర్పంచ్​ల ప్రతిపాదనలు ఎంపీడీవో కార్యాలయంలోనే ఆగిపోతాయన్నారు.

Sidiri
Sidiri

By

Published : Jan 25, 2022, 7:59 PM IST

Minister Sidiri Appalaraju: వైకాపా నేతల మాట వినకపోతే తెలుగుదేశం పార్టీ సర్పంచ్​ల ప్రతిపాదనలు ఎంపీడీవో కార్యాలయంలోనే ఆగిపోతాయని ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

ప్రజాప్రతినిధులు అందరూ అన్ని రకాల పనుల ప్రతిపాదనలు పంపించాలని మంత్రి సూచించారు. అన్ని పంచాయతీలను ఆదర్శ పంచాయతీలుగా తీర్చి దిద్దే బాధ్యతను.. ఎంపీపీలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

మంత్రి సీదిరి అప్పలరాజు వివాదస్పద వ్యాఖ్యలు

ABOUT THE AUTHOR

...view details