Sayavathi Ratod Comments On Governor: దిల్లీలో గవర్నర్ తమిళిసై చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలపై ఇప్పటికే మంత్రి కేటీఆర్ స్పందించగా.. మహిళా మంత్రి సత్యవతి రాఠోడ్ ఘాటుగానే స్పందించారు. గవర్నర్ వ్యాఖ్యలు చూస్తూంటే.. ఆమె మనసులో ఏముందో అర్థమవుతోందని.. తాను ఓ భాజపా కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ వ్యాఖానించారు. సీఎం కేసీఆర్కు మహిళలు అంటే గౌరవమని... అత్యంత గౌరవంగా, మర్యాదగా చూసుకునే సంస్కృతి ఆయనకుందని మంత్రి వివరించారు. కలవాల్సిన వారిని కలవకుండా భాజపా వారిని కలిసి ప్రభుత్వంపై విమర్శలు చేయడం సబబు కాదన్నారు.
గవర్నర్ వ్యాఖ్యలపై మంత్రి సత్యవతి రాఠోడ్ ఘాటు స్పందన .. ఏమన్నారంటే..? - మంత్రి సత్యవతి రాఠోడ్ ఘాటు స్పందన
Sayavathi Ratod Comments On Governor: గవర్నర్ తమిళి సై దిల్లీలో రాష్ట్రప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆమె వ్యాఖ్యలపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఘాటుగా స్పందించారు. గవర్నర్ తమిళిసై భాజపా నాయకురాలిగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
"నేను తలుచుకుంటే ప్రభుత్వం కూలిపోతుందని గవర్నర్ అనడం సబబు కాదు. ఆమె మాటల్లోని ఆంతర్యం ఏంటో తెలంగాణ ప్రజలకు అంత అర్థం అయింది. ఏమైనా ఉంటే ఇక్కడే చెప్పాల్సింది. కానీ ప్రధానమంత్రి, హోంమంత్రిని కలిసి రాష్ట్ర ప్రభుత్వంను బెదిరించినట్టు మాట్లాడారు. ఆమె ఆరోపణలు విన్నాక.. ఒక గవర్నర్గా కాకుండా భాజపా కార్యకర్తగా మాట్లాడినట్టు అనిపిస్తోంది. 119 స్థానాలకు గానూ వందపై చిలుకు తెరాస ఎమ్మెల్యేలు ఉన్న ప్రభుత్వాన్ని కులుస్తామంటున్న గవర్నర్.. గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలిస్తే ఏం జరిగిందో గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు కూడా అదే గతి పడుతుంది." - సత్యవతి రాఠోడ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి
సంబంధిత కథనాలు: