తెలంగాణ

telangana

ETV Bharat / city

పోషకాహార లోపాన్ని అధిగమిస్తాం: మంత్రి సత్యవతి రాఠోడ్​ - minister satyavathi rathode review

పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు అంగన్​వాడీ కేంద్రాలతో సమన్వయం చేసుకుని ముందుకెళ్తామని మంత్రి సత్యవతి రాఠోడ్​ తెలిపారు.  గిరిపోషణ్​ పథకానికి నిధులు విడుదల కోసం కేంద్రంపై ఒత్తిడి చేస్తామన్నారు.

పోషకాహార లోపాన్ని అధిగమిస్తాం: మంత్రి సత్యవతి రాఠోడ్​

By

Published : Oct 3, 2019, 6:02 PM IST


గిరిజన ప్రాంతాల్లోని పిల్లలు, మహిళలు పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​ తెలిపాడు. పోషణ్​ అభియాన్​ ద్వారా ఏజెన్సీ ప్రాంతాల్లో అమలు చేస్తున్న గిరిపోషణ్​ పథకంపై మహిళ, శిశు, గిరిజన సంక్షేమ అధికారులతో మంత్రి సమీక్షించారు. ప్రస్తుతం 414 అంగన్​వాడీ కేంద్రాల ద్వారా 13 వేల మందికి పోషకాహారాన్ని అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ పథకాన్ని మిగిలిన గిరిజన ప్రాంతాలన్నింటికీ వర్తింపజేసేలా సీఎం కేసీఆర్​ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఒత్తిడి చేసి కేంద్రం నుంచి నిధులు రాబడతామని పేర్కొన్నారు.

పోషకాహార లోపాన్ని అధిగమిస్తాం: మంత్రి సత్యవతి రాఠోడ్​

ABOUT THE AUTHOR

...view details