గురుకులాల్లో పిల్లల భవిష్యత్ కోసం అనేక ప్రయోగాలు చేస్తూ అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది మంచి విజయాలు నమోదు చేస్తున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు.
తెలంగాణ గిరిజన గురుకుల విద్యాలయాల ఉపాధ్యాయ సంఘం డైరీ, క్యాలెండర్ను ఆమె ఆవిష్కరించారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి గిరిజన గురుకులాలను చూస్తున్నానని.. తెలంగాణ వచ్చే వరకు ఒకెత్తు, ఇప్పుడొకెత్తు అని వ్యాఖ్యానించారు.