తెలంగాణ

telangana

ETV Bharat / city

చిన్నారుల మధ్య మంత్రి సత్యవతి జన్మదిన వేడుకలు - గిరిజన, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​ జన్మదిన వేడుకలు

హైదరాబాద్​ యూసఫ్​ గూడ శిశువిహార్​లో మంత్రి సత్యవతి రాఠోడ్​ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఇకనుంచి పాఠశాలలోని చిన్నారులందరికీ తానే జన్మదిన వేడుకలు నిర్వహిస్తానని పేర్కొన్నారు.

చిన్నారుల మధ్య మంత్రి సత్యవతి జన్మదిన వేడుకలు

By

Published : Oct 31, 2019, 6:18 PM IST

చిన్నారుల మధ్య మంత్రి సత్యవతి జన్మదిన వేడుకలు
హైదరాబాద్​ యూసఫ్ గూడ శిశువిహార్​లో గిరిజన, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. శిశువిహార్​లోని చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి మంత్రి వేడుకలు చేసుకున్నారు. ఇకనుంచి పాఠశాలలోని పిల్లలందరికీ తానే పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తానని తెలిపారు. అవిభక్త కవలలైన వీణ-వాణీలను పరామర్శించారు. ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్​లకు కృతజ్ఞతలు చెప్పారు.

ఎంపీ సంతోష్​ విసిరిన గ్రీన్ చాలెంజ్​లో భాగంగా తన ఇద్దరు కుమారులతో కలిసి శిశువిహార్ ప్రాంగణంలో మూడు చొప్పున మొక్కలు నాటారు. ఎంపీ కవిత, ఎమ్మెల్యే హరిప్రియ, జడ్పీ ఛైర్​పర్సన్ బిందును మొక్కలు నాటాల్సిందిగా సత్యవతి రాఠోడ్​ కోరారు.

ABOUT THE AUTHOR

...view details