హైదరాబాద్ మీర్‌పేట, బడంగ్‌పేట కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. పట్టణ ప్రణాళికలో భాగంగా అధికారులు, కార్పొరేటర్లు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. సమస్యలు ఉంటే పరిష్కరించాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలే: మంత్రి సబిత - sabitha indra reddy latest news
హైదరాబాద్ మీర్‌పేట, బడంగ్‌పేట కార్పోరేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ప్రజల సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి
ప్రతి ఇంటి ముందు ఐదు మొక్కలు నాటాలని, తడి, పొడి చెత్తను వేరు చేయాలన్నారు. డ్రైనేజ్, రోడ్లు శుభ్రంగా ఉంచుకోవాలని చూచించారు. 10 రోజుల్లో మీర్‌పేట, బండగ్‌పేట కార్పొరేషన్లలో సమూల మార్పులు తీసుకురావాలని మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో కందుకూరు ఆర్డీవో రవీందర్ రెడ్డి, మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ల పాల్గొన్నారు.
ఇవీ చూడండి:పట్టణ ప్రగతిలో అందరూ భాగస్వాములవ్వాలి: సీఎస్