ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సర ఫలితాలు మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇంటర్ ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 68.86శాతం, మొదటి సంవత్సరంలో 60.01శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. కొమురం భీం ఆసిఫాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలు మొదటి, రెండు స్థానాల్లో నిలిచాయి. అభ్యంతరాలపై ఆన్లైన్లో ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించారు. రీవెరిఫికేషన్, రీవాల్యుయేషన్ సదుపాయం కల్పించనున్నట్టు ఇంటర్ బోర్డు వెల్లడించింది.
ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 2,83,462 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 68.86 శాతం పాసవ్వగా... బాలికలు 75.15శాతం, బాలురు 62.10శాతం ఉత్తీర్ణులయ్యారు.1,67,942 మంది ఏ-గ్రేడ్, 80,096 మంది బీ-గ్రేడ్, 27,423 మంది సీ-గ్రేడ్, 8,001 మంది డీ-గ్రేడ్ పొందారు.