తెలంగాణ

telangana

ETV Bharat / city

'రాష్ట్రంలో త్వరలోనే వ్యాక్సినేషన్​ ప్రక్రియ ప్రారంభం' - మంత్రి సబితా ఇంద్రారెడ్డి

వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలో జరుగుతున్న ఇంటింటి జ్వర సర్వేను ఎమ్మెల్యే మహేశ్​రెడ్డి, కలెక్టర్ పౌసుమి బసుతో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. సర్వే నిర్వహిస్తున్న ఆశా వర్కర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పరిగి ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేశారు.

minister sabitha indra reddy inspected fever survey
minister sabitha indra reddy inspected fever survey

By

Published : May 19, 2021, 4:48 PM IST

రాష్ట్రంలో త్వరలోనే వ్యాక్సినేషన్​ ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్​... నిత్యం సమీక్షలు జరుపుతూ... కొవిడ్ నివారణ చర్యలు చేపడుతున్నారని మంత్రి వివరించారు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలో జరుగుతున్న ఇంటింటి జ్వర సర్వేను ఎమ్మెల్యే మహేశ్​రెడ్డి, కలెక్టర్ పౌసుమి బసుతో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. జ్వర సర్వేలో కొవిడ్ లక్షణాలున్నవారికి మెడికల్ కిట్లు అందించాలని అధికారులకు సూచించారు. జ్వర సర్వే ద్వారా లక్షణాలున్న వారిని ముందుగా గుర్తించడం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

సర్వే నిర్వహిస్తున్న ఆశా వర్కర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పరిగి ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేశారు. కొవిడ్ నిర్ధరణ పరీక్షల నిర్వహణ, ఆస్పత్రిలో గర్భిణి మహిళలకు అందుతున్న వైద్యంపై అధికారులను ఆరా తీశారు. వికారాబాద్ అనంతగిరిలో ఐసోలేషన్ బెడ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలంతా లాక్​డౌన్ నిబంధనలు పాటిస్తూ కరోనా కట్టడిలో భాగస్వాములు కావాలని మంత్రి కోరారు.

ఇదీ చూడండి: ఎన్నికల విధులకు హాజరైన 1,673‬ మంది టీచర్లు మృతి!

ABOUT THE AUTHOR

...view details