విద్యారంగంపై కరోనా తీవ్ర ప్రభావం చూపిందని ఆ శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పరీక్షల సమయంలోనే లాక్డౌన్ విధించడం వల్ల ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసినట్లు పేర్కొన్నారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ సాధ్యం కానందున వారిని కూడా ఉత్తీర్ణులుగా ప్రకటించామని వెల్లడించారు. డిగ్రీ, పీజీ, ఇంజినీర్ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులను ప్రమోట్ చేసినట్లు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సూచనలతో విద్యా సంవత్సరం ప్రారంభానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.
ఈ విద్యాసంవత్సరం అసలు పాఠశాలలు తీస్తారా అనే సందేహం ఉందని విపక్ష సభ్యులు ప్రశ్నించారు. చిన్నారుల తల్లిదండ్రుల్లో అనేక సందేహాలు ఉన్నాయన్నారు. ఆన్‌లైన్ క్లాసులు వినే గ్రామీణ విద్యార్థులకు ట్యాబ్‌లు ఇస్తారా అని అడిగారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని పేర్కొన్నారు.