Sabitha Indra Reddy: రంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. దశలవారీగా నియోజకవర్గంలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామాలను అభివృద్ధి పరుస్తూ ముందుకు సాగుతామని మంత్రి అన్నారు. ఆయా పట్టణాలలో నాలాలతో పాటు తాగునీటి అవసరాలు తీర్చడానికి సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు విడుదల చేశారని మంత్రి పేర్కొన్నారు.
అందులో భాగంగానే తుక్కుగూడ మున్సిపాలిటీ మంకల్ కమాన్ నుంచి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు వరకు రహదారి వెడల్పునకు రూ.50 లక్షలతో చేపట్టనున్న పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. రావిర్యాలలో రూ.20 లక్షలతో నిర్మించనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సీసీ రోడ్డు పనులకు, కోటి రూపాయలతో కడుతున్న వైకుంఠధామం నిర్మాణానికి మంత్రి అంకురార్పణ చేశారు.