మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా... ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలకు పెద్దపీట వేశారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ పాలకమండలి ప్రమాణస్వీకారానికి... ఎడ్లబండిపై ర్యాలీగా వెళ్లి మంత్రి హాజరయ్యారు. రైతుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో మహిళలకు పెద్దపీట : మంత్రి సబిత - చేవెళ్ల మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారానికి మంత్రి సబిత హాజరు
దేశంలో ఎక్కడలేని విధంగా... ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ పాలకమండలి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు.
![వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో మహిళలకు పెద్దపీట : మంత్రి సబిత minister sabhitha indrareddy attend to chevella agriculture morket committee oath ceremony](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8876380-thumbnail-3x2-sabitha.jpg)
వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో మహిళలకు పెద్దపీట : మంత్రి సబిత
కోటి ఎకరాల మాగాణి కల సాకారం దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం... కోటిన్నర ఎకరాలకు రైతుబంధు ఇచ్చినట్టు మంత్రి తెలిపారు. రైతుబంధు కోసం బడ్జెట్లో 14వేల 500 కోట్లు కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. అనంతరం మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ శివలీల, పాలకవర్గంతో ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, జడ్పీ ఛైర్పర్సన్ అనితరెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చూడండి:ఊపందుకున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థిత్వాల ఎంపిక
TAGGED:
chevella