రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్పేట్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి... నూతన గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో అత్యాధునిక గ్రంథాలయ భవనం నిర్మించాలని నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ అత్యాధునిక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారని... అదే స్ఫూర్తితో రూ.4 కోట్లు వెచ్చించి, అన్ని హంగులతో నిర్మిచినట్టు తెలిపారు. జ్ఞానం పెంపొందించే విధంగా, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి అందుబాటులో ఉండేలా గ్రంథాలయం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, రంగారెడ్డి జడ్పీ ఛైర్మన్ అనితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, అధికారులు, ప్రజాప్రతినిధిలు పాల్గొన్నారు.
నియోజకవర్గానికో గ్రంథాలయం నిర్మిస్తాం: మంత్రి సబిత - బడంగ్పేట్లో గ్రంథాలయానికి శంకుస్థాపన
రంగారెడ్డి జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో అత్యాధునిక గ్రంథాలయ భవనం నిర్మించనున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బడంగ్పేట్లో ఇవాళ గ్రంథాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

నియోజకవర్గానికో గ్రంథాలయం నిర్మిస్తాం: మంత్రి సబిత
నియోజకవర్గానికో గ్రంథాలయం నిర్మిస్తాం: మంత్రి సబిత