ROJA ON THREE CAPITALS: విజయదశమి రోజున 3 రాజధానులకు మద్దతుగా ప్రజలందరూ దేవాలయాలకు వెళ్లి పూజలు చేయాలని.. మంత్రి రోజా పిలుపునిచ్చారు. ఏపీ అభివృద్ధి కోసమే సీఎం జగన్.. పరిపాలన వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని పశ్చిమగోదావరి జిల్లా తణుకులో రోజా చెప్పారు. అలాంటి ప్రభుత్వానికి ప్రజలు మద్దతివ్వాలని కోరారు. చంద్రబాబునాయుడు తన బినామీల కోసం నకిలీ పోరాటం చేస్తున్నారని.. ఆయనను ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే ఎడ్ల బండలాగుడు పోటీలను నిర్వహించడం అభినందనీయం అన్నారు.
మూడు రాజధానుల కోసం ప్రజలందరూ పూజలు చేయాలి: మంత్రి రోజా
ROJA ON THREE CAPITALS: ఏపీ అభివృద్ధి కోసమే సీఎం జగన్.. పరిపాలన వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని మంత్రి ఆర్కే రోజా అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జాతీయస్థాయి ఒంగోలు ఎద్దుల బండలాగుడు ఐదో రోజు పోటీలను మరో మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో కలిసి ఆమె ప్రారంభించారు. అనంతరం సరదాగా ఎడ్లబండిని తోలారు.
ROJA
తన నియోజకవర్గ కేంద్రం నగరిలోనూ ఇటువంటి పోటీలు కారుమూరి వెంకట నాగేశ్వరరావు దగ్గరుండి జరిపిస్తానని చెప్పడం ఆనందంగా ఉందని అన్నారు. తణుకు నియోజకవర్గంలో కొత్తగా మంజూరైన పింఛన్లను పంపిణీ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జాతీయస్థాయి ఒంగోలు ఎద్దుల బండలాగుడు ఐదో రోజు పోటీలను మరో మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో కలిసి ఆమె ప్రారంభించారు. అనంతరం సరదాగా ఎడ్ల బండిని తోలారు.
ఇవీ చదవండి: