తెలంగాణ

telangana

ETV Bharat / city

అన్ని ఆస్పత్రుల్లో కొవిడేతర సేవలు ప్రారంభించండి: ఈటల

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొవిడేతర సేవలను ప్రారంభించాలని మంత్రి ఈటల రాజేందర్​ వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం బీఆర్కే భవన్​లో వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రంలో కొవిడ్ కేసుల పరిస్థితిపై ఆరా తీశారు. ఆక్సీజన్ పడకల అందుబాటు సహా ఆస్పత్రుల్లో పరిస్థితులను సమీక్షించారు.

'అన్ని ఆస్పత్రుల్లో నాన్ కొవిడ్ సేవలు ప్రారంభించాలి'
'అన్ని ఆస్పత్రుల్లో నాన్ కొవిడ్ సేవలు ప్రారంభించాలి'

By

Published : Sep 30, 2020, 5:40 AM IST

గాంధీ సహా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొవిడేతర సేవలను ప్రారంభించాలని మంత్రి ఈటల రాజేందర్​ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఇటీవల జరిగిన వైద్య విద్య పీజీ పరీక్షలో పలువురు ఫెయిల్ అవ్వడంతో పాటు.. విద్యార్థుల నుంచి వినతులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మంగళవారం బీఆర్కే భవన్​లో వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో కొవిడ్ కేసుల పరిస్థితిపై ఆరా తీశారు. ఆక్సీజన్ పడకల అందుబాటు సహా ఆస్పత్రుల్లో పరిస్థితులను సమీక్షించారు. కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికిీ.. ప్రజలు మాత్రం సామాజిక దూరం, మాస్క్‌లు ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇవీ చూడండి:మహిళలు, బాలికల రక్షణలో ప్రభుత్వం విఫలమైంది: సీతక్క

ABOUT THE AUTHOR

...view details